Pages

Monday, January 11, 2016

A THREE DAY WORKSHOP ON e- CONTENT DEVELOPMENT - 11th to 13th Jan, 2016

ఆంధ్రా లయోలా కళాశాలలో వికీపీడియా విద్యా కార్యక్రమం
విజయవాడ: జనవరి 11, 12, 13 తేదీల్లో వికీపీడియా విద్యా కార్యక్రమాన్ని ఆంధ్రా లయోలా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు, భౌతిక శాస్త్రం, సాంఖ్యక శాస్త్రం, వృక్ష శాస్త్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో విభాగానికి పది మంది చొప్పున ఎంపిక చేసిన 42 మంది విద్యార్థులను వారితో వికీపీడియాలో ఖాతాలు తయారుచేసుకుని, తమ తమ సబ్జెక్టులకు సంబంధించిన వ్యాసాలు సృష్టిస్తున్నారు. కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ యాక్సెస్ టు నాలెడ్జ్ (సీఐఎస్-ఎ2కె) సంస్థ, ఆంధ్రా లయోలా కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియా విద్యాకార్యక్రమం కళాశాలలో ఒకటిన్నర సంవత్సరం నుంచి కొనసాగుతోంది. ప్రధానంగా విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ వికీపీడియాలు పరిశీలించడం, అంతర్జాలంలో లభించే పలు ప్రామాణిక మూలాలను, వారి పాఠ్యపుస్తకాలను ఆధారం చేసుకుని కొత్త వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నారు. కార్యక్రమం వల్ల విద్యార్థులు వికీపీడియాలో రాయడం ద్వారా తమ నైపుణ్యాలు, ఆసక్తులు అభివృద్ధి చేసుకుంటున్నారని, అదే సమయంలో వికీపీడియాలో కొత్త వారు చేరి మరిన్ని వ్యాసాలు అభివృద్ధి అవుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. 










కార్యక్రమం వల్ల తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల వికీపీడియాల్లో పలు విభాగాలకు చెందిన విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు అభివృద్ధి అవుతున్నాయి. కార్యక్రమ నిర్వహణకు కళాశాల వికీపీడియా కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.శివకుమారి, సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ రహ్మానుద్దీన్ షేక్, ప్రోగ్రాం అసోసియేట్ పవన్ సంతోష్, తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె.శేఖర్, సంఖ్యా శాస్త్ర అధిపతి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సహాయ భాస్కరం, తదితరులు కృషిచేశారు.


ఆంధ్రా లయోలా కళాశాలలో డిజిటల్ రీసోర్సు సెంటర్ ప్రారంభం

విజయవాడ: ఆంధ్రా లయోలా కళాశాలలో జనవరి 13 తేదీన డిజిటల్ రీసోర్సు సెంటర్ ప్రారంభం కానుంది. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ యాక్సెస్ టు నాలెడ్జ్ (సీఐఎస్-ఎ2కె) మరియు ఆంధ్రా లయోలా కళాశాల (ఏఎల్సీ) సంయుక్తంగా 10 కంప్యూటర్లతో డిజిటల్ రీసోర్సు సెంటర్ ను ఏర్పాటుచేశాయి. డిజిటల్ రీసోర్సు సెంటర్ ఏర్పాటు వికీపీడియన్లు మరియు ఆంధ్రా లయోలా కళాశాలలోని విద్యార్థి వికీపీడియన్లకు ఉపకరించేందుకు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని స్థానిక వికీపీడియన్లు శిక్షణ సమావేశాల కోసం ఉపయోగించుకోవచ్చు. 


డిజిటల్ రీసోర్సు సెంటర్ ను హైదరాబాద్ విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర విభాగాధిపతి ఆచార్య జి.ఉమామహేశ్వరరావు ప్రారంభిస్తారు. కళాశాల ప్రిన్సిపల్ రెవ.ఫ్రాన్సిస్.జి.ఎ.పి.కిశోర్, కళాశాల కరస్పాండెంట్ ఫాదర్. ఎస్.రాజు, సంపాదకులు డాక్టర్ సామల రమేష్ బాబు, సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ రహ్మానుద్దీన్, కళాశాల తెలుగు రీడర్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కళాశాల వికీపీడియా కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.శివకుమారి మాట్లాడతారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె.శేఖర్, సంఖ్యా శాస్త్ర అధిపతి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సహాయ భాస్కరం మరియు తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృపారావు తదితరులు పాల్గొంటారు. 


1 comment:

  1. when people with big heart, do a small thing it will be a great help to many.
    congrats ALBA , in particular Dr.B.Shiva Kumari madam.

    ReplyDelete