Andhra Loyola College in Collaboration with CIS-A2K Bengulure organized a Two Day e- Content development Workshop for Special Telugu Students on 13th and 14th Feb, 2016 . 30 students participated in this workshop and digitalized 750 pages. Dr. B. Siva Kumari, Coordinator, Dr, T. Sekhar organizing secretary and Mr. Pawan Santhosh programmer participated in this workshop.
TELUGU INFORMATION:
13, 14 తేదీల్లో ఆంధ్ర లొయొలా కళాశాలలో నిర్వహించిన డిజిటైజేషన్ స్ప్రింట్ కార్యక్రమం ద్వారా 750కి పైగా పేజీలను డిజిటైజ్ చేయడం ద్వారా తెలుగు వికీసోర్సును అభివృద్ధి చేశారు. విద్యార్థులు పుస్తకాలను వికీసోర్సులోకి చేర్చడం, ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రిజల్యూషన్) సాఫ్ట్ వేర్ పై పనిచేయడం, వికీసోర్సులో పేజీలను డిజిటైజ్ చేయడం వంటివి నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె సంస్థ ఆంధ్ర లొయొలా కళాశాల సంయుక్త నిర్వహణలో నిర్వహించగా, కొత్త వికీపీడియన్లకు మార్గదర్శనం చేయడంలో తెలుగు వికీపీడియన్ విశ్వనాధ్ (పోడూరు, పశ్చిమ గోదావరి) పాల్గొన్నారు.
తెలుగు వికీసోర్సు అంతర్జాలంలోని స్వేచ్ఛా గ్రంథాలయం. పబ్లిక్ డొమైన్లో కానీ, క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల్లో కానీ లభించే స్వేచ్ఛా లైసెన్సుల్లోని తెలుగు భాషా గ్రంథాలను డిజిటైజ్ చేసి, వికీసోర్సు ద్వారా అందుబాటులోకి తెలుస్తున్న స్వచ్చంద కార్యకర్తలు (వికీసోర్సర్లుగా వ్యవహరిస్తారు) అంతర్జాలంలో దాదాపుగా 8మంది ఉన్నారు. వారి కృషి వల్ల పాపులర్ సైన్సు నుంచి మతపరమైన సాహిత్యం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రచయితల సాహిత్యం వరకూ పలు రకాల గ్రంథాలను దాదాపు 29,680 పేజీల డిజిటైజ్ అయిన పాఠ్యం వికీసోర్సులో అందుబాటులో వుంది.
ఆంధ్ర లొయోలా కళాశాలకు చెందిన 25మంది విద్యార్థి వికీపీడియన్లు కార్యక్రమంలో పాల్గొని పుస్తకాలను వికీసోర్సులో చేర్చడం, స్కాన్ చేసిన ఇమేజిని ఓసీఆర్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి పాఠ్యంగా మార్చగలగడం, వికీసోర్సులో టైప్ చేయడం ద్వారా పుస్తకాలు డిజిటైజ్ చేయడం, ప్రూఫ్ రీడింగ్ చేయడం వంటివి నేర్చుకుని వికీసోర్సులో కృషిచేశారు. 750కి పైగా పేజీలను తెలుగు వికీసోర్సులో డిజిటైజ్ చేశారు. మరింత ముఖ్యంగా దాదాపు 10 మందికి పైగా కొత్త వికీసోర్సర్లు వికీసోర్సులో కృషిచేయడం ప్రారంభించారు. ఇది 2 రోజుల పాటు సాగే కార్యక్రమమే కావడంతో మరిన్ని కొనసాగింపు కార్యకలాపాలు కళాశాలలో విద్యార్థి వికీపీడియన్లకు జరుగుతాయి. ఆయా కార్యక్రమాల్లో డిజిటైజేషన్ కు సంబంధించిన పలు కొత్త టెక్నాలజీలు నేర్పించవచ్చు. ఓసీఆర్ ని విద్యార్థులకు నేర్పించే ప్రక్రియ కళాశాలలో అత్యంత కొత్త ప్రక్రియగా ప్రారంభించబడింది. విద్యార్థులు డిజిటైజేషన్ గురించి నేర్చుకోవడం మాత్రమే కాకుండా తెలుగు పుస్తకాలకు నేరుగా అంతర్జాలంలో తమ వంతు కృషిచేసిన ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ సందర్భంగా ఫాదర్ పూదోట జోజయ్య తాను రచించిన పుస్తకాల్లో 12 గ్రంథాలను క్రియేటివ్ కామన్స్ షేర్ ఎలైక్ లైసెన్సులో స్వేచ్ఛగా విడుదల చేశారు. కార్యక్రమ నిర్వహణలో లయొలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జి.ఎ.పి.కిషోర్ ఎస్.జె, కళాశాల వికీపీడియా సమన్వయకర్త ఆచార్య శివకుమారి, వికీపీడియా నిర్వాహకుడు విశ్వనాధ్ బేసె (పోడూరు), సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్ పవన్ సంతోష్, కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కోలా శేఖర్ కృషిచేశారు. సీనియర్ విద్యార్థులు నాయక్, రాయ్, వెంకటేష్, సాగర్, బాబా వలీ, ప్రసాద్ సహకరించారు.
"వికీ సోర్సును విద్యార్ధులకు పరిచయం చేయడం ద్వారా దానిని మరింత బలోపేతం చేయవచ్చు." అంటూ అనుభవజ్ఞులైన వికీపీడియన్ విశ్వనాధ్ (పోడూరు) పేర్కొన్నారు.
No comments:
Post a Comment